ముహూర్తం కుదిరినట్లే!

Nikki and Aadi Pinishetty


హీరో ఆది పినిశెట్టి కూడా పెళ్లి పీటలెక్కనున్నాడు. తెలుగులో విలన్ పాత్రలు, సైడ్ రోల్స్ చేస్తూ ఆది బిజీగా ఉన్నాడు. కానీ, పర్సనల్ లైఫ్ లో కూడా సంథింగ్ సందడి ఉందట. అతను చాలా కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రానితో డేటింగ్ లో ఉంది. ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ నుంచి మరింత సీరియస్ అడుగులు వేస్తున్నారట.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెలలోనే ఎంగేజ్ మెంట్ అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఇరువైపులా పెద్దలు అంగీకరించారట.

నిక్కీ, ఆది కలిసి 2015లో విడుదలైన ‘మలుపు’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య బంధం ఉంది. తమిళ మీడియా సమాచారం ప్రకారం వీరిద్దరూ తమ పెళ్లి మ్యాటర్ ని త్వరలోనే మీడియాకి చెప్తారట.

ప్రస్తుతం ఆది పినిశెట్టి రామ్ హీరోగా రూపొందుతున్న ‘వారియర్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. నిక్కీ తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె కన్నడ హీరోయిన్ సంజన గల్రాని (‘బుజ్జిగాడు’ఫేమ్) చెల్లెలు.

Advertisement
 

More

Related Stories