అభిమానులని నిరాశపర్చిన మేకర్స్

Prabhas


ప్రభాస్ అభిమానులకు మరోసారి బ్యాడ్ న్యూసే వచ్చింది. ఊహాగానాలు నిజం కాలేదు. ఈ రోజు శ్రీరామనవమి స్పెషల్ గా ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ వస్తోంది అని ఊదరగొట్టారు. కానీ ఒక పిచ్చి వీడియోని పోస్ట్ చేశారు దర్శకుడు ఓం రౌత్. కొందరు అభిమానులు చేసిన పోస్టర్లన్నిటిని కూర్చి దాన్ని షేర్ చేశారు ఓం రౌత్. తన సినిమాకి సంబంధించిన పోస్టర్ ఇవ్వాల్సింది పోయి అభిమానుల చేసిన పోస్టర్లని సోషల్ మీడియా నుంచి తీసుకొని… శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పారు.

ప్రభాస్ అభిమానులని ఈ చర్య బాగా నిరాశపర్చింది. ఇక ‘సలార్’ గ్లిమ్ప్స్ టీజర్ రానుంది అనే ప్రచారం కూడా తప్పయింది. ఈ విషయాన్ని టీం కన్ఫర్మ్ చేసింది.

‘రాధేశ్యామ్’ ఘోరమైన పరాజయం చెందిన తర్వాత ప్రభాస్ అభిమానులు డీలాపడ్డారు. దాంతో, ఇక వారి ఆశలు, అంచనాలన్నీ ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలపైనే. వారిలో జోష్ నింపాలంటే ఈ సినిమాలకు సంబంధించిన ఏదైనా ఒక అప్డేట్ వస్తుంది అని అనుకున్నారు. కానీ ఏ అంచనాలు నిజం కాలేదు.

అలాగే, మారుతి డైరెక్షన్ లో రూపొందే సినిమా లాంచ్ కూడా వాయిదా పడింది.

Advertisement
 

More

Related Stories