‘సీతారామం’ విజయంతో హ్యాపీ: రష్మిక

దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన ‘సీతారామం’ సినిమాలో రష్మిక మందన కీలక పాత్ర పోషించింది. కథకి కీలకమైన పాత్ర. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో, ఈ భామ ఆనందంగా ఉంది. తనది హీరోయిన్ పాత్ర కాకపోయినా ఒక యూనిక్ రోల్ చెయ్యడం హ్యాపీ ఉందని చెప్తోంది.

“సీతారామం విజయంతో హ్యాపీగా ఉన్నాను. దర్శకుడు హను అఫ్రిన్ పాత్ర గురించి చెప్పినపుడే ఇది మంచి పాత్ర అవుతుందని బలంగా నమ్మాను. నమ్మకం నిజమైయింది. ఇలాంటి వయలెంట్ పాత్ర చేయలేదు కాబట్టి ఛాలెంజ్ గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది. పైగా అన్ని హీరోయిన్ పాత్రలే చేశాను ఇప్పటివరకూ. నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని భావిస్తున్న టైములో ఇది దక్కింది,” అని రష్మిక చెప్పింది.

హీరోయిన్ గా రిస్క్ అనిపించలేదా? ” కంఫర్ట్ జోన్ లో ఉండి సినిమాలు చేసుకుంటూ పొతే సక్సెస్ లు వస్తాయి. కానీ డిఫరెంట్ పాత్రలు చేయాలన్న కోరిక తీరదు. అందుకే, అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నాను. ‘సీతారామం’ అలాంటిదే,” అనేది రష్మిక వివరణ.

Sita Ramam

డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా ? “స్పోర్ట్స్, యాక్షన్, బయోపిక్.. ఇలా చేయాలనీ వుంటుంది. ఇప్పుడే కదా కెరీర్ ఊపందుకొంది.. ఇంకా చాలా చేయాలి.”

రష్మిక ఇప్పుడు తెలుగులో కన్నా బాలీవుడ్ లో ఎక్కువ పాపులర్ అయింది. ఒక్క సినిమా కూడా హిందీలో విడుదల కాలేదు. కానీ అప్పుడే మూడు సినిమాల్లో నటిస్తోంది. “హిందీలోనే కాదు .. తెలుగులోనూ ఇలా జరిగింది. ‘ఛలో’ షూటింగ్ టైంలోనే ‘గీతగోవిందం’, ‘దేవదాస్’ చిత్రాల అవకాశాలు వచ్చాయి,” అని రష్మిక చెప్తోంది.

Advertisement
 

More

Related Stories