డేట్ మారింది… షూటింగ్ మరింత పెరిగింది!

Rajamouli


రాజమౌళి సినిమా అంటే ఒక విజువల్ వండర్. ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్, సెట్స్, యాక్షన్ సీన్స్ హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ఉంటాయి. అందుకే, రాజమౌళి ఇప్పుడు ఇండియా అంతా ఒక బ్రాండ్ నేమ్. ఆ పేరు ఒక్క రోజులో రాలేదు. పర్ ఫెక్షన్ కోసం శిల్పాన్ని చెక్కినట్లు తన సినిమాని విడుదల తేదీ దగ్గరపడేవరకు తీస్తూనే ఉంటారు. అక్టోబర్ 13న విడుదల కావాల్సిన “ఆర్ ఆర్ ఆర్ ” వాయిదా పడింది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

దాంతో, మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ డేట్స్ అడిగారట రాజమౌళి. మరో రెండు పెద్ద షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. హైదరాబాద్ లో వీటిని ఈ నెలాఖరులో తీస్తారు. ఇటీవలే ఉక్రెయిన్ లో ఒక సాంగ్ తీశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమా కోసం రెండున్నర ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. మరో నెల డేట్స్ ఇచ్చేందుకు హీరోలకు కూడా అభ్యంతరం ఏముంటుంది. రాజమౌళి సినిమా అంటే తప్పదు మరి. ఆ విషయం వారికి కూడా తెలుసు.

అందుకే, “ఆర్ ఆర్ ఆర్” మొత్తంగా గుమ్మడికాయ కొట్టేంతవరకు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా మొదలుపెట్టాడట. ఐతే, ఈ కొత్త షెడ్యూల్స్ లో హీరోయిన్ల డేట్స్ అవసరం ఉండకపోవచ్చు. అలియా భట్, ఒలివియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లు. తమ పోర్షన్ ని వాళ్ళు ఇప్పటికే పూర్తిచేశారు.

మరోవైపు, ఈ సినిమాని ఉగాది కానుకగా మర్చి 31, 2022న విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.

Advertisement
 

More

Related Stories