శైలేష్ కెరీర్ కి బ్రేకులు పడ్డాయి!

Sailesh Kolanu

విశ్వక్ సేన్ హీరోగా నటించిన “హిట్”, అడవి శేష్ హీరోగా రూపొందిన “హిట్ 2” చిత్రాలతో దర్శకుడిగా హిట్ డైరెక్టర్ అనిపించుకున్నారు శైలేష్ కొలన్. మూడో విజయం అందుకొని హ్యాట్రిక్ అందుకోవాలన్న అతని కల కలగానే మిగిలిపోయింది. దానికితోడు, ఇప్పుడు మొత్తం కెరీర్ ప్రమాదంలో పడింది.

శైలేష్ తీసిన “సైంధవ్” సినిమా సంక్రాంతి కానుకగా విడుదలయి ఘోర పరాజయం పాలైంది. వెంకటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ దర్శకుడు శైలేష్ ఏమి తీశాడో ఆయనికి తెలియాలి. దాంతో, సినిమా అపజయం పొందింది.

ఇప్పుడు శైలేష్ కోలన్ కి కొత్త సినిమాల ఆఫర్లు రావడం అంత సులువు కాదు. ఇంతకుముందే “హిట్” సినిమా సిరీస్లో భాగంగా మూడో సినిమా ప్రకటించారు. “హిట్ 3″లో తాను నటిస్తాను అని నాని ప్రకటించారు. అది మొదలుకావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ ఆ సినిమాతో మళ్ళీ విజయం అందుకున్నా శైలేష్ కి ఆ సిరీస్ తో తప్ప మరో దానితో విజయం రాదు అన్నట్లుగా మారుతుంది.

ఆ విధంగా శైలేష్ కెరీర్ కి “సైంధవ్” బ్రేకులు వేసింది.

Advertisement
 

More

Related Stories