భన్సాలీ డైరెక్షన్లో భార్యాభర్తలు

రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్ లో పేరొందిన జంట. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప. పాప పుట్టిన తర్వాత అలియా భట్ మొదటి సినిమా ఒప్పుకొంది. అదీ కూడా తన భర్త సరసన.

బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ కొత్త సినిమా పేరు.. “లవ్ అండ్ వార్.” ఇందులో మెయిన్ హీరో, హీరోయిన్లుగా రణబీర్ కపూర్, అలియా భట్ నటించనున్నారు. మరో హీరోగా విక్కి కౌశల్ నటిస్తాడట. 2025 క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుంది.

రణబీర్ కపూర్, అలియా భట్ ఇంతకుముందు “బ్రహ్మాస్త్ర” సినిమాలో కలిసి నటించారు. ఇక భన్సాలీ గత చిత్రం “గంగూబాయి”లో అలియా నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా పొందింది.

షారుక్ ఖాన్ హీరోగా “ఇన్సాల్లా “, సల్మాన్ ఖాన్ తో మరో చిత్రం భన్సాలీ ప్లాన్ చేసినా అవి వర్కవుట్ కాలేదు. దాంతో, “యానిమల్” సినిమా తర్వాత టాప్ హీరోగా మారిపోయిన తన శిష్యుడు రణబీర్ కపూర్ తో మూవీ తీస్తున్నారు. భన్సాలీ తీసిన “సావరియా” చిత్రంతోనే రణబీర్ హీరోగా అడుగుపెట్టాడు.

Advertisement
 

More

Related Stories