పెళ్లి చేసుకున్న శ్రద్ధ ఆర్య

‘గొడవ’ అనే సినిమాలో నటించిన శ్రద్ధ ఆర్య గుర్తుందా? ‘గొడవ’ సినిమాతో పాటు ‘కోతిమూక’, ‘రోమియో’ వంటి సినిమాల్లో నటించింది. ఈ భామ ఆ తర్వాత సినిమాలు వదిలి హిందీ సీరియల్స్ లో బిజీ అయింది. ఈ భామ ఈ రోజు వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

నావల్ ఆఫీసర్ రాహుల్ నాగల్ ని పెళ్లాడింది. వీరి పెళ్లి వేడుక సింపుల్ గా ముంబైలో జరిగింది. “జస్ట్ మారీడ్” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది శ్రద్ధ ఆర్య. వీరిది అరేంజ్డ్ మ్యారేజ్ అంట.

“కసం తేరే ప్యార్ కే”, “కుండలి భాగ్య” వంటి సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది శ్రద్ద ఆర్య. తెలుగులో హీరోయిన్ గా పెద్దగా పాపులర్ కాలేకపోయింది.

Advertisement
 

More

Related Stories