వరంగల్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఈవెంట్

క్రిస్మస్ కి వస్తున్న భారీ చితం… శ్యామ్ సింగ రాయ్. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన మూవీ. టీజర్ ఇప్పటికే అందరిని ఆకట్టుకొంది. ఈ సినిమా ప్రొమోషన్ ని కూడా భారీగా చేస్తున్నారు మేకర్స్. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వరంగల్‌ నగరంలోని రంగలీల మైదానంలో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు టీం అంతా కూడా ఈ ఈవెంట్‌‌లో పాల్గొననున్నారు. నాని నటించిన ‘ఎంసిఏ’ ఈవెంట్ కూడా వరంగల్ లోనే జరిగింది. అది సూపర్ హిట్.

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories