సిద్ శ్రీరామ్ కి ట్రోలింగ్

Sid Sriram

గాయకుడు సిద్ శ్రీరామ్ ఈ మధ్య పాడిన ప్రతి పాట వైరల్ అవుతోంది. అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్ అతను. సిద్ శ్రీరామ్ పాడితే ఆ సినిమాకి ఆటోమేటిక్ గా క్రేజ్ వస్తుందని మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ భావిస్తున్నారు. “పుష్ప” సినిమాలో “శ్రీవల్లి” పాట ఎంత క్రేజ్ తెచ్చుకుందో మొన్నే చూశాం.

ఫస్ట్ టైం అతను మహేష్ బాబు సినిమాలో పాడారు. “కమాన్ కమాన్ కళావతి” అని తమన్ కంపోజ్ చేసిన ఈ పాట కూడా బాగా వైరల్ అయింది. “సర్కారు వారి పాట” సినిమా కోసం అతను పాడిన ఆ పాటతో యుట్యూబ్ వ్యూస్ రికార్డులు కనిపిస్తున్నాయి. ఐతే, పాట వైరల్ కావడంతో పాటు ట్రోలింగ్ కూడా తెచ్చిపెట్టింది.

సిద్ శ్రీరామ్ తన తెలుగు ఉచ్చారణతో భాషని చంపేస్తున్నాడు అని కామెంట్స్ చాలాకాలంగా వినిపిస్తున్నాయి. “కళావతి” పాట బాగుంది కానీ సిద్ తనదైన పద్దతిలోనే పాటని “చించి, అతికించి, ఇరికించి, వదిలించి” కిల్ చేశాడు అని అంటున్నారు.

అతనికి తగ్గట్లే ఈ మధ్య పాటల రచయిత అనంత శ్రీరామ్ అడ్డదిడ్డంగా ప్రాస ప్రయాసలు పడుతున్నాడు. అధోగతి పాలు చేస్తున్నాడు సాహిత్యాన్ని అని అంటున్నారు విమర్శకులు.

Advertisement
 

More

Related Stories