నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు

Telangana

ఎన్నికల సమరం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. అధికార భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడో ప్రకటించింది. మూడోసారి విజయం సాధించేందుకు పక్కా ప్లానింగ్ తో వెళ్తోంది.

ఎన్నికల డేట్ ఎప్పుడు వస్తుందో అని చాలా సినిమాల నిర్మాతలు టెన్షన్ పడ్డారు. తమ సినిమాల విడుదల తేదీన ఎన్నికల డేట్ పడితే ఇబ్బంది అవుతుంది అని కంగారు పడ్డారు. ఆ బాధ పోయింది. డిసెంబర్ సినిమాలకు లైన్ క్లియర్ అయింది.

డిసెంబర్ 8న విడుదల కావాల్సిన వరుణ్ తేజ్ చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” యధావిధిగా విడుదల అవుతుంది.

ఇక నాని హీరోగా రూపొందుతోన్న “హాయ్ నాన్న”, “నితిన్ మూవీ “ఎక్స్ట్రా” చిత్రాలు తమ డేట్స్ ని ప్రకటిస్తాయి. ఈ సినిమాలు క్రిస్మస్ కి విడుదల కావాలనుకున్నాయి. కానీ, “సలార్” డిసెంబర్ 22న వస్తోంది. దాంతో, కొత్త డేట్స్ కోసం ఈ సినిమా నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కొత్త డేట్స్ ప్రకటిద్దామని ఆగారు. సో, ఇప్పుడు వాళ్ళు డేట్స్ అనౌన్స్ చెయ్యొచ్చు.

Advertisement
 

More

Related Stories