తెలంగాణాలో లాక్డౌన్ పొడిగింపు

Charminar

తెలంగాణాలో లాక్డౌన్ ని పొడిగించారు. మొదట 10 రోజుల పాటు లాక్డౌన్ ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం దాన్ని ఇప్పుడు నెలాఖరు వరకు పొడిగించింది. నిబంధనల్లో మార్పు లేదు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కలాపాలకు అనుమతి ఉంది. నిత్యావసర వస్తువులు, రవాణా, షాపులు అన్నింటికీ ఉదయం నాలుగు గంటల పాటు అనుమతించారు. మిగతా 20 గంటలు లాక్డౌన్ రూల్స్ పాటించాల్సిందే!

ప్రభుత్వ లెక్కల ప్రకారం కేసుల సంఖ్య రోజుకు 5, 6 వేలు నమోదవుతున్నాయి. అయితే అనధికార అంచనాల ప్రకారం దానికి డబుల్ రేంజులోనే కేసులుంటాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఈ సంఖ్య కొంత తక్కువే. ఐతే, ఆసుపత్రిల్లో వెంటిలేటర్ తో కూడిన, ఆక్సిజన్ బెడ్స్ కొరత ఎక్కువగా ఉంది. జనంలో ఆందోళన కూడా చాలా ఉంది.

దానికి తోడు వ్యాక్సిన్లు లేవు. అందుకే, తెలంగాణ ప్రభుత్వం నెలాఖరు వరకు లాక్డౌన్ పొడిగించాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మే నెలాఖరు వరకు కర్ఫ్యూ, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తోంది.

Advertisement
 

More

Related Stories