‘డన్కీ’కి థియేటర్లు ఫిక్స్!

Dunkee

డిసెంబర్ 22న షారుక్ ఖాన్, ప్రభాస్ పోటీ పడనున్నారు. ఒకే రోజు షారుక్ ఖాన్ నటించిన “డన్కీ”, ప్రభాస్ నటించిన “సలార్” విడుదల కానున్నాయి. ఇద్దరు పెద్ద హీరోలు, రెండు భారీ చిత్రాల మధ్య పోటీ. ఈ రెండు సినిమాలకు భారీ ఎత్తున థియేటర్లు కావాలి.

షారుక్ ఖాన్ సినిమాకి థియేటర్లు ఫిక్స్ అవుతున్నాయి. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ “జవాన్” ఇంకా థియేటర్లలో నడుస్తోంది. ఈ ఏడాది షారుక్ “పఠాన్”, “జవాన్” వంటి కళ్ళు చెదిరే హిట్స్ ఇచ్చారు కాబట్టి నార్త్ ఇండియాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు “డన్కి”కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారట. ఐతే, మల్టిప్లెక్స్ స్క్రీన్ల విషయంలోనే తేడా వచ్చేలా ఉంది.

“సలార్”కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, మల్టిప్లెక్స్ స్క్రీన్ లు మాత్రం షారుక్, ప్రభాస్ చేరి సగం పంచుకోవాల్సి ఉంటుంది. మొదటి వీకెండ్ తర్వాత ఏ సినిమా నిలబడితే దానికే ఎక్కువ స్క్రీన్ లు ఇస్తారు. మొదటి మూడు రోజులు మాత్రం “డన్కి”, “సలార్” చేరి సగం పంచుకోవాలి.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం షారుక్ ఖాన్ తన సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కేలా అంతా సెట్ చేసుకుంటున్నారు.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన “డన్కి” చిత్రం టీజర్, ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు. “జవాన్” థియేటర్ల నుంచి బయటికి వెళ్ళాక ప్రమోషన్స్ మొదలవుతాయి.

Advertisement
 

More

Related Stories