కొండపొలం చాలా కొత్తగా ఉంటుంది: వైష్ణవ్

Vaisshnav Tej

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా అడుగుపెట్టాడు వైష్ణవ్ తేజ్. రెండో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో చేశాడు. అదే.. ‘కొండపొలం’. అక్టోబర్ 8న కానున్న ఈ మూవీ గురించి వైష్ణవ్ చెప్పిన ముచ్చట్లు…

కొండపొలం… కొత్త కథ

‘కొండపొలం’ అనే కాన్సెప్ట్ అనేది చాలా కొత్తది. ఇంతకుముందు ఎవరూ ఈ కాన్సెప్ట్ ని వెండితెరపై చూడలేదు. నా మొదటి సినిమా విడుదల కాకముందే క్రిష్ ఈ సినిమా ఆఫర్ ఇచ్చారు. ‘ఉప్పెన’ రిలీజ్ టైంకి ‘కొండపొలం’ షూటింగ్ కూడా పూర్తి అయింది. క్రిష్ సినిమాలంటే మొదటినుంచి ఇష్టం. ఆయన డైరెక్షన్లో నటించే అవకాశం రెండో సినిమాకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నా సినిమాకు కీరవాణి సంగీతం ఇవ్వడం మరో మర్చిపోలేని అనుభూతి. ఆయన కొడుకు కాలభైరవ నా ఫ్రెండ్.

ఆర్ట్ సినిమా కాదు

ఇది ఆర్ట్ సినిమా కాదు. సందేశం ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంది. మొదటి సినిమాలో చేపల వృత్తి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిగా నటించాను. ఇందులో గొర్రెల కాపరి పాత్ర. సినిమాకి తగ్గట్లు, కథకి అనుగుణంగా నా లుక్ ఉంటుంది. అలాగే డైలాగ్స్ కూడా సహాజంగా ఉంటాయి. పూర్తిగా ‘నల్లమల’ ప్రాంతం యాసలోనే మాట్లాడాను.

షూటింగ్ … కరోనా టైం…

సినిమా షూటింగ్ కరోనా టైంలోనే పూర్తి చేశాం. వికారాబాద్ అడవుల్లో కొండలు ఎక్కుతూ.. నడుస్తూ షూటింగ్ పూర్తి చేశాం. రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండటం మొదట్లో కష్టంగా అనిపించింది. తరువాత అలవాటైపోయింది.

సాయి ధరమ్ అన్నయ కోలుకుంటున్నారు…

‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్ ఆఫీసర్ గా నటించారు. నేను ఇందులో గొర్రెల కాపరి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ గా మారుతాను. రెండు సినిమాలకు ఏమి లింక్ లేదు. ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నారు అన్నయ్య. తొందర్లనే బయటకు వస్తారు.

కొత్త సినిమాలు

ప్రస్తుతం గిరీషయ్య అనే తమిళ దర్శకుడు తీస్తున్న తెలుగు చిత్రంలో నటిస్తున్నాను.

Advertisement
 

More

Related Stories