సుమంత్ కు మార్కెట్ పెరిగిందా?

1 Cr for Subrahmanyapuram Satellite
Monday, December 10, 2018 - 10:45

మొన్నటివరకు సుమంత్ సినిమాల్ని పట్టించుకున్న వారు లేరు. కానీ గతేడాది వచ్చిన "మళ్లీ రావా" సినిమా సుమంత్ ను మళ్లీ ట్రాక్ లో పెట్టింది. అప్పటి ఆ సక్సెస్ ఇప్పుడు సుమంత్ చేసిన కొత్త సినిమాకు మంచి రేటు తీసుకొచ్చింది. అవును.. సుమంత్ నటించిన "సుబ్రహ్మణ్యపురం" మూవీ కోటి రూపాయల బిజినెస్ చేసింది. 

ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ కోటి రూపాయల మొత్తానికి దక్కించుకుంది. సుమంత్ నటించిన ఓ సినిమాకు శాటిలైట్+డిజిటల్ రూపంలో ఇంత మొత్తం అంటే అది చాలా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే గతంలో సుమంత్ నటించిన కొన్ని సినిమాలైతే ఇప్పటివరకు శాటిలైట్ రైట్స్ కింద అమ్ముడుపోలేదు కూడా. అలా చూసుకుంటే సుమంత్ మార్కెట్ కాస్త పెరిగినట్టే కదా. 

ఇదే ఊపులో సుబ్రహ్మణ్యపురంతో పాటు సైమల్టేనియస్ గా చేసిన "ఇదం జగత్‌" సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నాడు ఈ హీరో.  ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది.