ట్ర‌యిల‌ర్‌తో ఆక‌ట్టుకోగ‌లిగిన 47 డేస్‌

47 Days trailer is interesting
Thursday, April 18, 2019 - 17:45

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "47 డేస్". ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్
కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. 

విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. జీవితానికి మించిన మిస్ట‌రీ లేద‌నుకునే పోలీసు ఆఫీస‌ర్ ఒక మిస్టరీ కేసుని ఎలా ఛేదించాడ‌నేది క‌థ‌. ట్ర‌యిల‌ర్లోనే ద‌ర్శ‌కుడు మిస్ట‌రీని బాగా జోడించాడు. జ్యోతిల‌క్ష్మీ సినిమా నుంచి వ‌రుస‌గా వైవిధ్య‌మైన సినిమాల‌ను ఎన్నుకుంటున్న స‌త్య‌దేవ్ ఈ సినిమాలోనూ వైవిధ్యంగా క‌నిపిస్తున్నాడు.

47 డేస్ అనేది ఒక‌ప్ప‌టి చిరంజీవి సినిమా టైటిల్‌. ఆ టైటిల్‌తో వ‌స్తోన్న ఈ మూవీ ట్ర‌యిల‌ర్‌తో ఐతే ఆక‌ట్టుకోగ‌లిగింది.