హెబ్బా: రాజ్ తరుణ్ స్పెషల్ కానీ

5 Questions: Hebbah Patel
Friday, April 24, 2020 (All day)

1. రాజ్ తరుణ్ ఎంత స్పెషల్?
రాజ్ తరుణ్ తో ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించాను. ఈ ఏడాది అది రిలీజ్ అవుతుంది. అతడితో మళ్లీ మళ్లీ నటించాలని ఉంది. నిజానికి మా కాంబినేషన్ లో మరో సినిమా ఉంది. ఆ వివరాలు త్వరలోనే చెబుతా.

2. ఆఫర్లు బాగానే వస్తున్నాయా? ప్రస్తుతం ఫోకస్ దేనిపైన?
సినిమాల కంటే వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టాను. 2 వెబ్ సిరీస్ లు త్వరలోనే వస్తాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. రెడ్ లో ఓ ఐటెంసాంగ్ చేశాను. దీంతో పాటు ఓ తెలుగు, ఓ తమిళ సినిమా కూడా పైప్ లైన్ లో ఉంది. ఇంకా ఫిక్స్ కాలేదు.

3. రెడ్ లో స్పెషల్ సాంగ్ గురించి?
రెడ్ లో స్పెషల్ సాంగ్ చేశాను. నేను డాన్స్ లో యావరేజ్. రామ్ బెస్ట్ డాన్సర్. మా ఇద్దరి కాంబోలో స్టెప్పులున్నాయి. ఈ పాటతో డాన్సర్ గా మరింత ఇంప్రూవ్ అయ్యాను. ఆ సాంగ్ కోసం వెయిటింగ్.

4. మిగతా హీరోలతో పోలిస్తే రాజ్ తరణ్ ఎంత క్లోజ్?
రాజ్ తరణ్ నాకు బాగా క్లోజ్. మిగతా హీరోలతో కూడా నేను ఒకేలా ఉంటాను. కానీ రాజ్ తరుణ్ తో ఇంకాస్త ఎక్కువ కంఫర్ట్ గా ఉంటాను. క్లోజ్ నెస్ తో పోలిస్తే, మిగతా హీరోల కంటే రాజ్ తరుణ్ కు ఒక మార్క్ ఎక్స్ ట్రా వేస్తాను.

5. టాలీవుడ్, బాలీవుడ్ ఆఫర్లు ఒకేసారి వస్తే..?
టాలీవుడ్, బాలీవుడ్ ఆఫర్లు ఒకేసారి వస్తే టాలీవుడ్ ఆఫర్ సెలక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ సరసన ఆఫర్ వస్తే అటే వెళ్లిపోతా. లేదంటే టాలీవుడ్ కే ఫిక్స్ అయిపోతా. లేదంటే బాలీవుడ్ నుంచి ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ వచ్చినా అటే వెళ్తా. లేదంటే ఇక్కడే. g