5 క్వశ్చన్స్: రాశిఖన్నా

5 Questions: Raashi Khanna
Tuesday, April 21, 2020 - 17:15

ఫస్ట్ డేట్ ఎక్స్ పీరియన్స్ ఏంటి
16 ఏళ్ల వయసులో ఫస్ట్ డేట్ కు వెళ్లాను. నా బాయ్ ఫ్రెండ్ బర్త్ డే ఆరోజు. పార్టీకని పిలిచాడు వెళ్లాను. అప్పట్లో అది డేట్ అని కూడా నాకు తెలియదు. ఇద్దరం కలిసి మెక్ డొనాల్డ్స్ కు వెళ్లాం. నాకు ఫుల్ ఆకలిగా ఉంది. ఓ రేంజ్ లో అన్నీ లాగించేశాడు. అతడు నన్ను పొగుడుతూనే ఉన్నాడు. నేను నవ్వుతూ మొత్తం తింటూనే ఉన్నా. పెద్దగా ఏం మాట్లాడలేదు. అదే నా ఫస్ట్ డేట్ ఎక్స్ పీరియన్స్.

ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పని విషయం
నాకు చిన్నప్పట్నుంచి గిటార్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు 2-3 సార్లు నేర్చుకునే ప్రయత్నం చేశాను కానీ కుదర్లేదు. మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్లీ ఈ లాక్ డౌన్ టైమ్ లో గిటారు తీశాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలాగైనా దాని మీద మంచి ట్యూన్ ప్లే చేయాలనేది నా కోరిక. ఇప్పటివరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు.

కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటారు?
నా దృష్టిలో ఇది చాలా సిల్లీ క్వశ్చన్. నేను అస్సలు కెరీర్ ప్లాన్ చేసుకోను. ఇప్పటివరకు అలానే జరిగింది. ఇకపై కూడా అంతే. నా నెక్ట్స్ మూవీ ఏంటనేది నేను ఆలోచించలేదు. కనీసం తెలుగులో చేస్తానా, తమిళ్ లో చేస్తానా అనే క్లారిటీ కూడా లేదు. ఎప్పుడూ ఇంతే.

ఒక్క రోజు ప్రధాని అయితే ఏం చేస్తావ్?
నేను కలలో కూడా ఊహించని ప్రశ్న ఇది. అసలు ఏం చేయాలి అని ఆలోచించేలోపే రోజు గడిచిపోతుంది. కానీ ఒకటి మాత్రం చేస్తా. అప్పటివరకు నడుస్తున్న వ్యవస్థకు నా వంతుగా సహాయం అందిస్తాను. అంతేతప్ప దేన్నీ పాడుచేయను

పెళ్లి ఎప్పుడు? కాబోయే భర్తలో క్వాలిటీస్?
ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు కాబోయే భర్త కూడా ఇలా ఉండాలని రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. కానీ ఒక కండిషన్ మాత్రం ఉంది. నాకు కాబోయే వాడు పొడుగ్గా ఉండాలి. పొడుగ్గా ఉండే అబ్బాయిలంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను కూడా పొడుగ్గా ఉంటాను కాబట్టి.