త‌మిళ ద‌ర్శ‌కుడికి స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌

96 movie director gets royal treatment from Dil Raju
Tuesday, November 27, 2018 - 00:30

త‌మిళంలో ఇటీవ‌ల బాగా పేరు తెచ్చుకున్న రొమాంటిక్ మూవీ.."96". ఈ సినిమాలో నటించిన త్రిష‌కైతే బోలేడంతా పేరు వ‌చ్చింది. హీరో విజ‌య్ సేతుప‌తికి ఎప్ప‌టిలాగే ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఫీల్‌ని తీసుకురావ‌డంలో యువ ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్ అద్భుత‌మైన ప్ర‌తిభని క‌న‌బ‌ర్చాడ‌ట‌. అందుకే ఈ సినిమా రైట్స్ కొన్న దిల్‌రాజు.. తెలుగు రీమేక్ బాధ్య‌త‌ల‌ను కూడా ఒరిజిన‌ల్ ద‌ర్శ‌కుడికే అప్ప‌గించాడు.

మ‌రే ద‌ర్శ‌కుడు కూడా ఆ ఫీల్‌ని తెలుగులో రాబ‌ట్ట‌లేడ‌నేది దిల్‌రాజు అభిప్రాయం. హీరో, హీరోయిన్ల గురించి మ‌రిచిపోయి..తెలుగు స్ర్కిప్ట్ విష‌యాన్ని పూర్తి చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్‌కి దిల్‌రాజు చెప్ప‌డ‌మే కాదు.. ఆ ద‌ర్శ‌కుడి కోసం ప్ర‌త్యేకంగా ఆఫీస్ తీసుకున్నాడు. ఇపుడు ప్రేమ్‌కుమార్ ఈ సినిమా వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు. దిల్ రాజుకి ఈ సినిమా పిచ్చ పిచ్చ‌గా న‌చ్చింద‌ట అందుకే డైర‌క్ట‌ర్‌కి స్పెష‌ల్ ట్రీట్‌మెంట్‌.

మూవీని చూసిన బ‌న్నికి కూడా బాగా న‌చ్చింద‌ట‌. అల్లు అర్జున్ తెలుగు రీమేక్‌లో న‌టించేందుకు ఉత్సాహం చూపుతున్నాడు. ఐతే బ‌న్ని త‌న ఇమేజ్‌కి ఇది సూట్ అవుతుందా లేదా అనే డైలామాలో ఉన్నాడ‌ట‌. మ‌రి ఈ సినిమాలో న‌టించే హీరో ఎవ‌రు. ప్ర‌స్తుతం దిల్‌రాజు అదే పనిలో ఉన్నాడు. హీరోని సెట్ చేసే ప‌నిలో.

మ‌రోవైపు, ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్ త్రిష‌నే తెలుగులోనూ రిపీట్ చేద్దామ‌ని అంటున్నాడ‌ట‌. హీరోని మీరు ఎవ‌రినైనా తెచ్చుకొండి, హీరోయిన్‌గా త్రిష‌నే తీసుకుందామ‌నేది ఆ ద‌ర్శ‌కుడి మాట‌. మ‌రి ఫైన‌ల్‌గా ఏ హీరో, ఏ హీరోయిన్ ఈ రీమేక్‌లో న‌టిస్తార‌నేది చూడాలి.