బ‌న్ని, త్రివిక్ర‌మ్ పాట‌ల ట్యూనింగ్ షురూ

AA19: Music process is on, says Thaman
Sunday, June 23, 2019 - 12:00

అల్లు అర్జున్‌తో మూడో సినిమాని డైర‌క్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్ పాట‌ల ట్యూనింగ్ షురూ చేశారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో పాట‌ల క‌స‌ర‌త్తు మొద‌లైంది. త్రివిక్ర‌మ్ సినిమాల్లో పాట‌లు బాగుంటాయి. ముఖ్యంగా బ‌న్ని, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండు సినిమాలు (జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి) మ్యూజిక‌ల్ హిట్స్‌. ఐతే త్రివిక్ర‌మ్ ఇపుడు త‌మ‌న్‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. 

"అర‌వింద స‌మేత" త‌ర్వాత త‌మ‌న్ త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో మ్యూజిక్ కంపోజ్ చేయ‌డం ఇది రెండోసారి. అర‌వింద స‌మేత ..క‌థ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు త్రివిక్ర‌మ్‌. డ్యాన్స్‌కి స్కోప్ ఉండే పాట‌లు త‌మ‌న్ ఇవ్వ‌లేక‌పోయాడు. ఈ సినిమాలో మాత్రం ఫుల్‌మీల్స్‌లా ఉంటుంద‌ట‌.

ఒక‌వైపు రెగ్యుల‌ర్ షూటింగ్‌, మ‌రోవైపు పాట‌ల కంపోజింగ్‌..రెండూ ఏక‌కాలంలో జ‌రుగుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.