విలన్ గా చేయడానికి కూడా రెడీ

Aadi Saikumar is ready to play villain
Saturday, October 19, 2019 - 18:30

ఫ్లాప్ తెచ్చుకుంటున్న హీరోలంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా మారిపోతున్నారు. అల్లరినరేష్, సుశాంత్, నవదీప్.. ఇలా ఈ లిస్ట్ లో చాలామంది హీరోలున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు హీరో ఆది సాయికుమార్. కేవలం హీరోగా నటించాలని గిరి గీసుకొని కూర్చోలేదని, మంచి క్యారెక్టర్ దొరికితే విలన్ గా కూడా నటించడానికి సిద్ధం అంటున్నాడు.

"ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో నా పాత్రను మాత్రమే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేవాడ్ని కాదేమో. స్టోరీ మొత్తం చెప్పడంతో నాకు నచ్చి, అర్జున్ పండిట్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. ఇదే టైపులో ఉంటే విలన్ పాత్రలో కూడా నటించడానికి సిద్ధం. స్టోరీ మొత్తం బాగుండి, అందులో నా పాత్ర చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే విలన్ గా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు."

ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు ఆది సాయికుమార్. అందరి హీరోల్లానే తను కూడా ఫ్లాపులు తట్టుకోలేనని, ఫ్లాప్ వచ్చిన వెంటనే గోవా వెళ్లిపోయి 2-3 రోజులు ఛిల్ అయి వస్తానంటున్నాడు. ఫ్లాప్ బాధ తనకు కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంటుందంటున్నాడు.