హాలీవుడ్ స్టోరీ కానీ కాన్పెప్ట్ నాదే!

Aaksh makes allegations against Puri
Tuesday, July 23, 2019 - 08:15

ఇస్మార్ట్ శంక‌ర్ పెద్ద హిట్ దిశ‌గా సాగుతోంది. ఇప్ప‌టికే వ‌సూళ్ల ప‌రంగా రామ్ కెరియ‌ర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఐతే...ఈ సినిమా క‌థ నాది అంటూ రిలీజ్‌కి ముందే ఓ ర‌చ‌యిత ఆరోప‌ణ‌లు చేశాడు. ఇపుడు మ‌రో ఆరోప‌ణ వ‌చ్చింది. ఈ సారి ఆరోప‌ణ చేసింది హీరో క‌మ్ డైర‌క్ట‌ర్ ఆకాష్‌. ఆనందం వంటి సినిమాల్లో హీరోగా న‌టించిన ఆకాష్ ఈ సినిమా కాన్సెప్ట్ నాదే అంటున్నాడు.

ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్పిడి చేయడమనే మూల కథతో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. ఇదే ఇతివృత్తంతో  ఇప్పటికే 'నాన్ యార్' పేరుతొ ఒక త‌మిళ సినిమా విడుద‌ల‌యింది. తెలుగులో  'కొత్తగా ఉన్నాడు' టైటిల్ తో త్వరలో  రిలీజ్ చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నాడు ఆకాష్‌. అందులో అత‌నే హీరో. ఇపుడు తెలుగులో డ‌బ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని, పూరి జ‌గ‌న్నాథ్ త‌మ‌కి న్యాయం చేయాలంటున్నాడు ఆకాష్‌. తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్ గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇదంతా బాగుంది కానీ ఈ కాన్సెప్ట్ ఆకాష్‌ది కాదు, మ‌రో రైట‌ర్‌ది కాదు ఐబాయ్‌, క్రిమిన‌ల్‌, ప్రాజెక్ట్ ఎక్స్ ... ఇలా ప‌లు హాలీవుడ్ చిత్రాల నుంచి లేపిన‌ది. పూరి తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ దాదాపుగా హ‌లీవుడ్ క్రిమిన‌ల్ సినిమా ఛాయ‌లున్నాయి. ఇక మిగ‌తా స్క్రీన్ ప్లే అంతా పోకిరి త‌ర‌హానే.