ఆమెకి అడ్డంకులు పోయాయి

Aame clears hurdles
Friday, July 19, 2019 - 20:15

మొత్తానికి ఆమె సినిమాకి అడ్డంకులు తొల‌గిపోయాయి. అమ‌లాపాల్ న‌టించిన "ఆమె" చిత్రం ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌ల కావాలి. కానీ ఉద‌యం సినిమా థియేట‌ర్ల‌లోకి రాలేదు. టికెట్ బుక్ చేసుకొని థియేట‌ర్‌కి వెళ్లిన త‌ర్వాత కానీ ఈ సినిమాకి ఫైనాన్సియ‌ల్ స‌మ‌స్య‌లున్నాయ‌ని అర్థం కాలేదు. 

త‌మిళ‌నాట ఈ సినిమా నిర్మాత‌కి, ఫైనాన్సియ‌ర్స్‌కి గొడ‌వ‌. దాంతో వారు ఉద‌యం రిలీజ్‌ని అడ్డుకున్నారు. మ‌ధ్యాహ్నానికి రాజీకొచ్చారు. సాయంత్రం నుంచి త‌మిళ‌నాట సినిమా ప‌డింది. కానీ తెలుగులో ఈ సినిమాకి పూర్తిగా డ్యామేజీ జ‌రిగింది. ఓపెనింగ్ మొత్తం పోయింది. 

అమ‌లాపాల్ న్యూడ్‌గా న‌టించింద‌న్న ప్ర‌చారంతో సినిమాకి తొలి ఆట‌కి మంచి అడ్వాన్స్ బుకింగ్స్ క‌నిపించాయి.