అక్టోబ‌ర్ 18న ర‌విబాబు 'ఆవిరి'

Aaviri confirms its release date
Sunday, October 6, 2019 - 16:30

'అల్ల‌రి', `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును` వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌కానుంది.

"రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముంద‌కు తీసుకువ‌స్తున్నాం. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా,థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది," అన్నారు ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు.