ట్రైలర్ తోనే బిజినెస్ క్లోజ్ చేసిన జార్జిరెడ్డి

Abhishek Pictures bag George Reddy rights
Thursday, October 10, 2019 - 18:15

స్టూడెంట్ పాలిటిక్స్ గురించి తెలిసిన వారందరికీ జార్జిరెడ్డి  పేరు తెలుసు. ఉస్మానియాలో ఒకప్పుడు జార్జి రెడ్డి  ఒక సంచలనం. ఆయన జీవితం స్ఫూర్తితోనే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ... తన "యువ" సినిమాలో సూర్య పాత్రని తీర్చిదిద్దారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బయోపిక్ రూపొందుతోంది. ఈ తరానికి జార్జ్ లాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు జీవన్ రెడ్డి అంటున్నారు. ఆయన  ట్రైలర్ రీసెంట్ గా విడుదలై సంచలనం సృష్టించింది. 

ట్రైలర్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులని తీసుకున్నారు. ఆయన ఈ మూవీ ని విడుదల చేస్తారు. ఒక్క ట్రైలర్ తోనే సినిమా బిజినెస్ కావడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.