నటుడు శివప్రసాద్‌ కన్నుమూత

Actor N Siva Prasad passes away
Saturday, September 21, 2019 - 20:00

ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత ఎన్‌. శివప్రసాద్‌  ఇక లేరు. ఆయనకి 68 ఏళ్లు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు.  ఆయన డాక్టర్‌ అయి యాక్టర్‌ అయ్యారు. 

రీసెంట్‌గా క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎక్కువగా పాపులర్‌ ఆయ్యారు.  2006లో డేంజర్‌ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.  శివ ప్రసాద్  నటించిన చివరి చిత్రం 'సాప్ట్ వేర్ సుధీర్' త్వరలోనే విడుదల కానుంది. 
భారతీరాజా తీసిన కొత్త జీవితాలు సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. అందులో హీరోయిన్‌ సుహాసినిని పెళ్లాడే ఆర్టిస్ట్‌గా నటించారు. ఆ తర్వాత ఖైదీ  పోరాటం, బొబ్బిలి బ్రహ్మాన్న వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. 

ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎంపీగా ఆయన వేసిన చిత్రవిచిత్ర వేషాలు హెడ్‌లైన్స్‌గా మారాయి.