జ‌య‌రాం కేసులో సినిమా తార‌ల విచార‌ణ‌

Actors grilled in Jayaram case
Wednesday, February 13, 2019 - 22:45

ఇటీవ‌ల దారుణ హ‌త్య‌కి గుర‌యిన వ్యాపార‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం మ‌ర్డ‌ర్ మిస్టరీని ఛేదించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు హైదారాబాద్ పోలీసులు. ఈ విచార‌ణ‌లో భాగంగా పోలీసులు కొంద‌రు సినిమా తార‌ల‌ను ప్ర‌శ్నించారు. జ‌య‌రాంని హ‌త్య చేసిన‌ట్లుగా భావిస్తున్న నిందితుడు రాకేష్ రెడ్డికి ఎవ‌రెవ‌రికీ సంబంధాలున్నాయ‌ని, అత‌ని కాల్ లిస్ట్‌లో త‌రుచుగా ఎవ‌రికీ ఫోన్లు వెళ్లాయ‌ని పోలీసులు చూశాడు. అందులో కొంద‌రు సినిమా తార‌లు ఫోన్ నెంబ‌ర్లు ఫ్రీక్వెంట్ కాల్స్ లిస్ట్‌లో పోలీసుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

సినిమా ఇండ‌స్ట్రీకి ఏ సంబంధం లేని రాకేష్‌రెడ్డి... క‌మెడియ‌న్ డుంబుతో పాటు మ‌రికొంద‌రితో ఫ్రెండ్సిప్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడ‌ట‌. దాంతో విచార‌ణ‌లో భాగంగా డుంబుని ప్ర‌శ్నించారు. డుంబు అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు పోషించాడు. డుంబు  అస‌లు పేరు సూర్య ప్ర‌సాద్‌. 

ఐతే రాకేష్ రెడ్డితో సాధార‌ణ ప‌రిచ‌యం త‌ప్ప అత‌నితో త‌న‌కి ఎలాంటి మ‌నీ లావాదేవీలు లేవ‌ని డుంబు పోలీసుల‌కి చెప్పిన‌ట్లు స‌మాచారం.