హీరోయిన్ అన‌న్య ఇల్లు మునిగింది

Actress Ananya's ordeal in Kerala floods
Monday, August 20, 2018 - 17:00

హీరోయిన్ అన‌న్య గుర్తుందా? మ‌ల‌యాళీ అనన్య కొన్ని తెలుగు సినిమాల్లోనూ న‌టించింది. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ తీసిన అ ఆ సినిమాలో నితిన్ సోద‌రిగా ఆమె చ‌క్క‌టి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించింది. ఈ హీరోయిన్ కూడా కేర‌ళ వ‌ర‌దల్లో చిక్కుకొంది.

వ‌ర‌ద‌ల‌తో కేరళ రాష్ట్రం అతలాకుతలం. ఎటూ చూసినా నీళ్లే. వ‌ర‌ద‌, బుర‌దే. ఈ వరదల్లో రెండు రోజుల పాటు న‌ర‌కం అనుభ‌వించింద‌ట అన‌న్య‌. ఫేస్‌బుక్‌లో త‌న బాధ‌ని షేర్ చేసింది అన‌న్య‌. ఆమె ఇల్లు మొత్తం మునిగిపోయింద‌ట‌. దాంతో ఆమె ఇపుడు మ‌రో న‌టి ఆశా శ‌రత్ (భాగ‌మ‌తి సినిమాలో సిబీఐ అధికారిణిగా న‌టించిందామె) ఇంట్లో త‌ల‌దాచుకుంటోంద‌ట‌. అక్క‌డ్నుంచి ఆమె ఫేస్‌బుక్‌లో ఈ వీడియోని పోస్ట్ చేసింది. .

శుక్రవారం ఉదయం వరకు సురక్షితంగానే ఉన్నాం. కానీ ‘నిమిషాల వ్యవధిలోనే నీటి మట్టం పెరిగిపోయింది. మా ఇల్లుతో పాటు మా బంధువుల ఇళ్లన్నీ కూడా నీట మునిగాయి. ఇపుడు ఆశా ఇంట్లో ఉన్నాను. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని అనన్య ఫేస్‌బుక్ వీడియోలో తెలిపారు.