న‌వాబ్‌లో ఆదితి డేరింగ్ యాక్ట్‌

Aditi Rao plays different role in Mani Ratnam's Nawab
Sunday, August 26, 2018 - 23:45

"చెలియా" సినిమాలో అందంగా, ఒద్దికైన పాత్ర‌లో క‌నిపించింది ఆదితి రావు. మ‌ణిర‌త్నం ఆమెని అంత సౌంద‌ర్యంగా చూపించిన తీరు చాలా మంది ద‌ర్శ‌కుల‌కి ఒక‌ ప్రేర‌ణ‌గా నిలిచింది. తాను రాసుకున్న సినిమా హీరోయిన్ పాత్ర‌కి ఆమె అయితేనే బాగుంటుంద‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి. "చెలియా" సినిమా చూసి.. ఆమెని త‌న "స‌మ్మోహ‌నం" సినిమాకి తీసుకున్నాడు. అంతేకాదు వ‌రుణ్ తేజ హీరోగా రూపొందుతోన్న "అంత‌రిక్షం" సినిమాలో ఆమెకి హీరోయిన్ పాత్ర ద‌క్కింది కూడా చెలియా చిత్రంతోనే. ఈ మూడు సినిమాల్లోనూ ఆమె పాత్ర‌లు సంప్ర‌దాయ‌బ‌ద్ద‌మైన‌వే, డేరింగ్ రోల్స్ కాదు.

మ‌ళ్లీ మ‌ణిర‌త్న‌మే ఆమెని మ‌రో కోణంలో చూపిస్తున్నాడిపుడు. ఈ సారి మ‌ణిర‌త్నం సినిమాలో ఆమె డేరింగ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ట‌. 

మ‌ణిర‌త్నం తాజాగా తీసిన చిత్రం.."న‌వాబ్‌". ఈ సినిమాలో ఆమె జ‌ర్న‌లిస్ట్‌గా నటిస్తోంది. అది కూడా ఎలాంటి జ‌ర్న‌లిస్ట్ పాత్ర అనుకుంటున్నారు? ఒక మాఫియా నాయ‌కుడి ప్రేమ‌లో ప‌డే పాత్ర అన్న‌మాట‌. ఒక విధంగా చెప్పాలంటే "నార్కోస్" అనే వెబ్‌సిరీస్‌లో డ్ర‌గ్స్ మాఫియా నాయ‌కుడ్ని ల‌వ్‌లో ప‌డేసిన జ‌ర్న‌లిస్ట్ రోల్ లాంటిది అనుకోవ‌చ్చు. ఇందులో ఆమెపై మంచి రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయ‌ట‌.