త‌మిళ అర్జున్‌రెడ్డిని కూడా వ‌ద‌ల‌రా?

Aditya Varma too will face criticism?
Wednesday, June 26, 2019 - 15:15

"క‌బీర్‌సింగ్" సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతోంది. తొలి ఐదు రోజుల‌కి 104 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టింది. ఐతే ఈ సినిమాకి బాలీవుడ్ క్రిటిక్స్ చాలా దారుణ‌మైన రేటింగ్స్ ఇచ్చారు. అంతేకాదు, మిజోగినిస్ట్ (పురాషాధ్యిక‌) మూవీ అంటూ తిట్టారు. ఇలాంటి సైకో సినిమాలు చూడొద్ద‌ని కొంద‌రు మ‌రీ ఓవ‌ర్‌గా రాశారు. దాంతో ఇపుడు త‌మిళ వెర్స్‌కి ఎలాంటి రివ్యూలు వ‌స్తాయో అని విక్ర‌మ్‌కి భ‌యంప‌ట్టుకునేలా ఉంది. 

హీరో విక్ర‌మ్ కొడుకు ధ్రువ్ అర్జున్‌రెడ్డి రీమేక్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇంత‌కుముందు వ‌ర్మ పేరుతో బాలా డైర‌క్ష‌న్‌లో దీన్ని రీమేక్ చేశారు. కానీ అది బాగా లేద‌ని, ప‌క్క‌న పెట్టి...మ‌ళ్లీ "ఆదిత్య వ‌ర్మ" పేరుతో మొత్తం రీషూట్ చేశారు. గిరీశ‌య్య అనే కొత్త ద‌ర్శ‌కుడు అర్జున్‌రెడ్డి సినిమాకి మ‌క్కీకి మ‌క్కీగా తీశాడ‌ట‌. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌ని బ‌ట్టి గిరీశ‌య్య‌... అర్జున్‌రెడ్డిని యాజిటీజ్‌గా ఫాలో అయ్యాడ‌నేది క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. 

హిందీలో హిట్ట‌యిన‌ట్లే త‌మిళంలోనూ హిట్ట‌యితే... విక్ర‌మ్‌కి పండ‌గే. కొడుకు సేఫ్‌గా లాంచ్ అయిన‌ట్లు అవుతుంది. ఐతే, బాలీవుడ్ క్రిటిక్స్‌లాగే అక్క‌డ కూడా ఫెమినిస్ట్‌లు, క్రిటిక్స్ ఈ "ఆదిత్య వ‌ర్మ‌"ని చీల్చి చెండాడుతారా అన్న‌దే ప్ర‌శ్న‌.