సెట్‌లో అఖిల్‌తో విరాట్ కోహ్లీ

Akhil and Kohli at Annapurna Studio sets
Wednesday, October 10, 2018 - 19:45

టీమిండియా క్రికెట్ కెప్టెన్ బుధ‌వారం అన్న‌పూర్ణ స్టూడియోలో ప్ర‌త్య‌క్షం అయ్యాడు. క్రికెట‌ర్‌కి స్టూడియోలో ఏం ప‌ని అనుకుంటున్నారా? విరాట్‌ కోహ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఓ యాడ్ ఫిల్మ్‌లో కోహ్లీ న‌టించాడ‌ట‌. ఈ సెట్‌కి అఖిల్ కూడా వ‌చ్చాడు. అఖిల్‌, కోహ్లీ మంచి మిత్రులు. అఖిల్ కూడా కోహ్లీతో యాడ్ ఫిల్మ్‌లో న‌టించాడ‌నే టాక్ న‌డుస్తోంది. కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు. 

ఇండియా, వెస్టిండీస్ మ‌ధ్య రెండో టెస్ట్‌ హైదరాబాద్ లో జ‌రుగనుంది. టెస్ట్ మ్యాచ్ క‌న్నా ముందే కోహ్లీ యాడ్ షూట్ పూర్తి చేసిన‌ట్లున్నాడు. కోహ్లీ, అక్కినేని అఖిల్‌తో స్టూడియోలో స‌రదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అఖిల్ ప్ర‌స్తుతం "మిస్ట‌ర్ మ‌జ్ను" అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే లండ‌న్‌లో పూర్త‌యింది. హైద‌రాబాద్‌లో మిగ‌తా భాగాన్ని తీయాలి.