అఖిల్... మ‌రి నెక్స్ట్ ఏంటి!

Akhil gets another flop and now what next?
Wednesday, January 30, 2019 - 13:30

అఖిల్ హ్య‌ట్రిక్ సాధించాడు. ఫ్లాపుల్లో!  అవును అఖిల్ నటించిన మూడో చిత్రం కూడా బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ల్లంత‌యింది. "మిస్ట‌ర్ మ‌జ్ను".. మొద‌టి వీకెండ్ మోస్త‌రు క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ఆ త‌ర్వాత పిక‌ప్ కాలేదు. మొత్తంగా ఇపుడు ఫ్లాప్ అని ట్రేడ్ పండితులు డిక్లేర్ చేశారు. ఐతే సినిమాని కాపాడాల‌ని త‌న వంతు ప్ర‌య‌త్నంగా అఖిల్..ఆంధ్రాలో టూర్ వేశాడు. ప్ర‌మోషన్ చేస్తున్నాడు.

మ‌రి ఆ త‌ర్వాత చేయ‌బోయే సినిమా ఏంటి? ఆ మ‌ధ్య మ‌లుపు ద‌ర్శ‌కుడు స‌త్య పినిశెట్టి డైర‌క్ష‌న్‌లో ఒక మూవీ చేయాల‌నుకున్నాడు. మ‌రి ఇపుడు ఆ మూవీ చేస్తాడా? లేక పెద్ద ద‌ర్శ‌కుడితో సినిమా సెట్ చేసుకుంటాడా? అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్ విష‌యంలో పూర్తిగా డీలాప‌డ్డారు.

2015లో "అఖిల్" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. అది భారీ ప్లాప్‌. ఆ త‌ర్వాత "హ‌లో" చిత్రం చేశాడు. అది కూడా నిరాశ‌ప‌ర్చింది. ఇపుడు ముచ్చ‌ట‌గా మూడో చిత్రం అంతే సంగ‌తులు.