అఖిల్‌కి కావాలి బిగ్ భామ‌!

Akhil wants big heroines
Monday, March 18, 2019 - 13:45

అఖిల్ మొదటి సినిమాలో కొత్త భామ నటించింది. రెండో సినిమాలోనూ కొత్త భామనే. మూడో సినిమాలో అంతగా పాపులర్ కానీ హీరోయిన్. ఇక నాలుగు చిత్రంలో మాత్రం బాలీవుడ్ రేంజ్ హీరోయిన్ ఐతే బెటర్ అంటున్నాడట అఖిల్. పేరున్న భామ ఉంటే.. తన సినిమాకి హెల్ప్ అవుతుందని అఖిల్ భావిస్తున్నాడిపుడు.

అఖిల్ సింగిల్‌గా ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాడు. అతనికి ఇంకా అంత స్టార్‌డ‌మ్ రాలేదు. అఖిల్ ఇప్పటి వరకు 3 సినిమాల్లో నటించాడు. మూడూ అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. అఖిల్ మొదటి సినిమాలో సాయేషా సైగల్ అనే కొత్త భామ. నటించింది. రెండో సినిమా 'హలో'లో ప్రియదర్శన్ కూతురు కల్యాణి పరిచయం అయింది. రీసెంట్ గా విడుదలైన “మిస్టర్ మజ్ను'లో నిధి అగర్వాల్ అనే అష్కమింగ్ భామ నటించింది.

అఖిల్ త్వరలోనే బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ డైరక్షన్లో నటించనున్నాడు. ఈ సినిమాకి కైరా అద్వానీని అడుగుతున్నట్లు సమాచారం.