సెకండ్ మూవీ సిండ్రోమ్‌ అధిగ‌మిస్తాడా?

Akhil worries over director's second movie syndrome
Monday, January 21, 2019 - 19:00

అఖిల్‌ అక్కినేని హీరోగా రూపొందుతోన్న "మిస్టర్ మజ్ను" సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకొంది. యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాలో ఒక్క సీన్‌కి, ఒక షాట్‌కి క‌ట్ చెప్ప‌లేద‌ట‌.

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తొలి ప్రేమ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని డైర‌క్ట్ చేశాడు. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌.

అఖిల్‌కి ఈ సినిమా ఆడ‌డం ఇంపార్టెంట్. కెరియ‌ర్‌లో ఒక్క హిట్‌లేదు అఖిల్‌కి. ఇప్ప‌టికే న‌ట‌నలో వీక్ అనిపించుకున్నాడు. క‌నీసం క‌మ‌ర్షియ‌ల్‌గా అయినా హిట్ అందుకుంటే..మిగ‌తావ‌న్నీ స‌ర్దుకుంటాయి. "మిస్ట‌ర్ మ‌జ్ను" ట్ర‌యిల‌ర్ అంత గొప్ప‌గా ఏమీలేదు.

"తొలి ప్రేమ" డైర‌క్ట‌ర్ సెకండ్ మూవీ సిండ్రోమ్ నుంచి బ‌య‌ట‌ప‌డుతాడా అన్న‌ది చూడాలి. తొలి సినిమాతో హిట్ అందుకొని ఆ త‌ర్వాత ఫ్లాప్ ఇచ్చిన డైర‌క్ట‌ర్ల జాబితా టాలీవుడ్‌లో చాలా పెద్ద‌ది. వెంకీ అట్లూరి ఆ సిండ్రోమ్‌ని అధిగ‌మిస్తాడా? అనేది అఖిల్‌ని వ‌ర్రీ చేస్తున్న మేట‌ర్‌. జ‌న‌వ‌రి 25న అస‌లు విష‌యం తెలుస్తుంది.