రెండు టీజ‌ర్ల‌లో కొత్త‌గా చెప్పిందేమిటి?

Akhil's Mr Majnu new teaser achieved anything?
Wednesday, January 2, 2019 - 23:45

అఖిల్ న‌టిస్తున్న మిస్ట‌ర్ మ‌జ్నుకి సంబంధించిన గ్లిప్మ్స్ (టీజ‌ర్‌లాంటిదే) వీడియో గ‌తేడాది న‌వంబ‌ర్‌లో విడుద‌లైంది. తాజాగా టీజ‌ర్ వ‌చ్చింది. రెండింటిలో మేట‌ర్ సేమ్‌..హీరో కాస‌నోవా పాత్ర‌లాంటిది అన్నది ఎస్టాబ్లిస్ చేయ‌డమే. ఈ కొత్త టీజ‌ర్ ఇంత‌కుముందు వ‌చ్చిన దానికి మించి ఏమీ చెప్ప‌లేదు, చూప‌లేదు. 

నిజానికి టీజ‌ర్ బ‌దులు ట్ర‌యిల‌ర్ రిలీజ్ చేసి ఉంటే సినిమాపై మ‌రింత‌గా న‌మ్మ‌కం పెరిగేది. అఖిల్ న‌టించిన సినిమాల‌పై ఎవ‌రికీ న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు అత‌నికి హిట్ లేదు. ఈ మూవీ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఇంత‌కుముందు తొలిప్రేమ వంటి గుడ్ రొమాంటిక్ మూవీ తీశాడ‌న్న కార‌ణంగానే అంతో ఇంతో దీనిపై బ‌జ్ ఉంది. ఐతే కొత్త‌గా మ‌రో పాయింట్ చెప్ప‌లేని టీజ‌ర్ల వ‌ల్ల ఒన‌గూర‌దేమీ ఉండ‌దు.

ఐతే అఖిల్ సిక్స్‌ప్యాక్ ఆబ్స్ చూపించ‌డం వ‌ల్ల కొంత అమ్మాయిలు సినిమాపై ఆస‌క్తి చూపే అవ‌కాశం ఉంది. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ నెల 25న విడుద‌ల కానుంది.