అక్ష‌ర తొలి పాటకి గుడ్ రెస్పాన్స్‌

Akshara first song is out
Saturday, March 23, 2019 - 00:15

విద్యని నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు అంటూ మంచి సందేశంతో అక్ష‌ర సినిమా నుంచి తొలి పాట వ‌చ్చింది. నందిత శ్వేత హీరోయిన్‌గా రూపొందుతోన్న మూవీ...అక్ష‌ర‌. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు చిన్న‌కృష్ణ‌.

సురేష్ బొబ్బిలి స్వ‌ర‌ప‌ర్చిన ఈ పాట‌ని అనురాగ్ కుల‌క‌ర్ణి పాడాడు. ఛ‌లో సినిమాలో చూసీ చూడ‌గానే వంటి హిట్ పాట‌, ఆర్ ఎక్స్ 100లో పిల్లా రా వంటి సెన్సేష‌న‌ల్ పాట పాడిన అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ సాంగ్‌ని కూడా అందంగా అలాపించాడు. అసుర‌ల‌ద‌ర...నిశ‌లు చెదర‌..అక్ష‌రాగ్ని శిఖ‌లు ఎగిసి ఆగ్ర‌హించెలే అనే లిరిక్స్‌తో సాగిన ఈ గీతం సినిమా థీమ్ ఏంటో వివ‌రించింది.