ఫ‌న్నీగా సాగిన అక్ష‌ర టీజ‌ర్‌

Akshara Teaser released
Thursday, June 20, 2019 - 14:15

నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలోఅహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’. ఈమూవీ టీజర్ లాంచ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి చేతులుమీదుగా జరిగింది. విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే అక్షర పోరాటం చాలా ఆసక్తిగా సాగుతుంది.  టీజ‌ర్ ఆలోచింప‌చేసే విధంగానూ ఉంది. ఎట్ ది సేమ్ టైమ్ వినోదాత్మ‌కంగా కూడా ఉండ‌డం విశేషం.

ఒక సీరియస్ పాయింట్ ని తీసుకొని ఎక్కడా ఎంటర్టై న్మెంట్ తగ్గకుండా రూపొందిచిన చిత్రం ‘అక్షర’. నందిత శ్వేతా లుక్స్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత
దగ్గర అవుతుందని నమ్ముతుంది చిత్రయూనిట్. 

ఈ మూవీ టీజర్ లాంచ్ కి చిత్ర యూనిట్ తోపాటు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, వరస విజయాలతో టాలీవుడ్ లోతనదైన ముద్రను వేసిన దర్శకుడు అనీల్ రావిపూడి పాల్గోన్నారు.