ప్రేమ దేశమా పాటకు మంచి స్పందన

Akshara's Prema Desam gets good response
Sunday, November 3, 2019 - 17:30

నందితశ్వేత లీడ్ రోల్ చేస్తున్న చిత్రం 'అక్షర'. బి. చిన్న కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కనులకు కాపాలాగా ఉంచా.. నీపేరు ప్రేమ దేశమా" అనే  పాట కి మంచి రెస్పాన్స్ వస్తోంది అని అంటున్నారు మేకర్స్. 

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ లిరిక‌ల్ టీజ‌ర్ ని చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది. `క‌నుల‌ను కాప‌లాగ వుంచా.. నీ పేరు ప్రేమ దేశ‌మా..మ‌న‌సుకు త‌లుపుల‌న్ని తెరిచా.. నీ ప్రేమ‌కింత అంద‌మా..` అంటూ సాగే పాటను గేయ ర‌చ‌యిత బాలాజీ రాయ‌గా అనుదీప్ దేవ్ ఆల‌పించిన‌ ఈ పాట మెలోడియ‌స్‌గా ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌లో ఆర్టిస్టులంద‌రినీ ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిక‌రం. మ‌ధునంద‌న్.. స‌త్య పాత్ర‌ల‌కు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్య‌త ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సురేష్ వర్మ అల్లూరి- అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సోషల్ మెసేజ్‌ తో కూడిన కామెడీ థ్రిల్లర్ చిత్ర‌మిది.