తండ్రి అయిన విజయ్

AL Vijay is blessed with baby boy
Saturday, May 30, 2020 - 21:45

దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. వృత్తిగతంగా డాక్టర్ అయిన ఐశ్వర్యను గతేడాది జులైలో పెళ్లి చేసుకున్నాడు ఏఎల్ విజయ్. అలా పెళ్లయి ఏడాది కూడా తిరక్కుండానే ఇప్పుడు ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఈరోజు ఉదయం ఐశ్వర్య మగబిడ్డకు జన్మనిచ్చింది. విజయ్-ఐశ్వర్య జంటకు బాబు పుట్టినట్టు అతడి తమ్ముడు, నటుడు ఉదయ ప్రకటించాడు.

హీరోయిన్ అమలాపాల్ నుంచి విడిపోయిన తర్వాత రెండేళ్లు సింగిల్ గా ఉన్న ఏఎల్ విజయ్.. గతేడాది జూన్ లో తన రెండో పెళ్లి వ్యవహారాన్ని బయటపెట్టాడు. అలా ప్రకటించిన నెల రోజులకే ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి అయ్యాడు.

అటు అమలాపాల్ మాత్రం తనింకా సింగిల్ అంటోంది. ఆమధ్య తను పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫొటోలు బయటకొచ్చినప్పటికీ అందులో నిజం లేదని, త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని ప్రకటించి తప్పించుకుంది. ఇటు విజయ్ మాత్రం ఫ్యామిలీమేన్ అయిపోయాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు కంగనారనౌత్ లీడ్ రోల్ లో తళైవి సినిమా చేస్తున్నాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ఇది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూట్ ఆగింది. వచ్చే నెలలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.