అలవైకుంఠపురంలో... ఓవర్సీస్‌ బంపర్‌ ఎమౌంట్‌

Alavaikunthapuramlo gets good price for overseas
Tuesday, September 24, 2019 - 17:45

రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి సాలిడ్‌ హిట్‌ లేదు. అందుకే ఏడాది గ్యాప్‌ తీసుకున్నాడు. ఐనా బన్నికి క్రేజ్‌ ఇంచ్‌ కూడా తగ్గలేదు. ఇక త్రివిక్రమ్‌..త్రివిక్రమే. హిట్స్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేని ఇమేజ్‌ ఆయనది. ముఖ్యంగా ఓవర్సీస్‌ మార్కెట్లో త్రివిక్రమ్‌ సినిమాలకుండే క్రేజే వేరు. నితిన్‌ వంటి హీరోతో కూడా ఆయన 2.5 మిలియన్‌ డాలర్ల ("అ ఆ")  బ్లాక్‌బస్టర్‌ అందించిన స్టార్‌డైరక్టర్‌ ఆయన. రీసెంట్‌గా ఎన్టీఆర్‌తో తీసిన "అరవింద సమేత" కూడా టూ మిలియన్‌ డాలర్ల మార్క్‌ని దాటింది.

మరి అలాంటి టాప్‌ డైరక్టర్‌ బన్నితో ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌ తీస్తుంటే...ఓవర్సీస్‌ బయ్యర్లు ఎగబడకుండా ఉంటారా? ఈ సినిమా ఓవర్సీస్‌ బిజినెస్‌ అపుడే క్లోజ్‌ అయింది. బ్లూస్కై సంస్థ ఈ మూవీ రైట్స్‌ని ఎనిమిదిన్నర కోట్లకి కొనుగోలు చేసింది. అంటే సూపర్‌ రేట్‌. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. పొంగల్‌ పోటీలో కింగ్‌ ఆఫ్‌ ఓవర్సీస్‌ అనిపించుకున్న మహేష్‌బాబు మూవీ "సరిలేరు నీకెవ్వరు" కూడా విడుదల అవుతోంది. రజనీకాంత్‌ నటిస్తోన్న "దర్బార్‌" కూడా పోటీలో ఉంది. ఇంత స్టిప్‌ కాంపిటీషన్‌లో "అల వైకుంఠపురంలో" రిలీజ్‌ కానుంది. ఐనా ఇంత మంచి ప్రైస్‌ రావడం విశేషం. 

అది త్రివిక్రమ్‌ సత్తా. ఇక బన్ని, త్రివిక్రమ్‌లది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. ఇంతకుముందు వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు కూడా అప్పటికి మంచి గ్రాసర్స్‌.