ఆలీకున్న యోగం....ఎమ్మెల్సీ

Ali to become MlC
Thursday, July 11, 2019 - 23:45

అధ్యక్షా అని అసెంబ్లీలో అనాలి అనేది ఆలీ డ్రీం. దాని కోసమే ఎన్నికలకి ముందు మూడు మునకలేశాడు. తెలుగుదేశం, వైఎస్సార్సీ, జనసేన పార్టీ ... ఇలా రౌండ్లు కొట్టి ఫైనల్‌గా వైఎస్సార్సీలో తేలాడు. అన్ని పార్టీలను ఊరించి చివర్లో గెలిచే పార్టీవైపు మొగ్గు చూపాడు. ఆయన పంట పండిందిపుడు. ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనని జగన్ ఎన్నికలకి ముందే తేల్చేశారు. ఐతే ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారట. దాన్ని ఇపుడు ఏపీ సీఎం జగన్ నిలబెట్టుకోబోతున్నారనేది టాక్.

ఎమ్మెల్యే ఐతే ఏంటి, ఎమ్మెల్సీ ఐతే ఏంటి.... అసెంబ్లీలో అధ్యక్షా అనడం గ్యారెంటీ. ఆ విధంగా ఆలీ డ్రీమ్ నెరవేరుతోంది. మరి మనం త్వరలోనే ఆ దృశ్యం చూడబోతున్నాం అన్నమాట. బాలనటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి హాస్య నటుడిగా మారి ఆ తర్వాత హీరో అయ్యాడు. హీరో నుంచి మళ్లీ కామెడీ వేషాల వైపు వచ్చాడు. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. కానీ బుల్లితెరపై బాగానే బిజీగా ఉన్నాడు. ఆర్టిస్ట్ గా ఫుల్లుగా సంపాదించుకున్నాడు. బాగా వెల్ సెటిల్డ్ కూడా.