ఆలియా సొంత దుకాణం

Alia Bhatt to launch her own YouTube channel
Wednesday, June 26, 2019 - 15:30

ఆలియా భ‌ట్ ఇక‌పై యూట్యూబ్ చానెల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌దేమో. ఎందుకంటే ఆమె సొంతంగా త‌న పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది ఇపుడు. దీన్ని ఆమె వ్లాగ్‌లా వాడుతుంద‌ట‌. వ్లోగ్ అంటే వీడియో బ్లాగ్ అన్న‌మాట‌. త‌న ఆలోచ‌న‌లు, త‌న ప్లాన్స్‌, త‌న టిప్స్ ....ఇలా త‌న‌కి సంబంధించిన‌వ‌న్నింటిని వీడియో రూపంలో ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంద‌ట‌.

ఆలియాకి చాలా ఐడియాస్ ఉన్నాయి. త్వ‌ర‌లోనే సినిమా ప్రోడ‌క్ష‌న్‌లోకి కూడా దిగ‌నుంది. ఇటీవ‌లే ముంబైలో ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేసింది. ఆ క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్లోనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, యూట్యూబ్ ప‌నులు సాగుతాయ‌ట‌. 

ఆలియా త్వ‌ర‌లోనే తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఆమె న‌టించ‌నున్న తొలి చిత్రం..రాజ‌మౌళి తీస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ సినిమా షూటింగ్‌లో ఆమె ఇంకా పార్టిసిపేట్ చేయ‌లేదు. ఆగ‌స్ట్‌లో ఆమె షెడ్యూల్ ఉండొచ్చ‌నేది టాక్‌. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌కి జోడిగా క‌నిపించ‌నుంది.