తెలుగునాట 350 థియేటర్స్ లో "అల్లాదీన్"

Alladin to release in 300 screens in AP and TS
Wednesday, May 22, 2019 - 00:30

అరేబియన్ నైట్స్ కథలలో అల్లాద్దీన్ అద్భుత దీపం కథకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఈ కథని ఎన్ని సార్లు సినిమా తీసినా  ప్రతి సారి కొత్తగానే అనిపిస్తుంది.  అందుకే మరో సారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికని వాడుకొని, అల్లాద్దీన్ కథని ఓ విజువల్ వండర్ గా రెడీ చేసారు. 

భారీ బడ్జెట్ తో అల్లాద్దీన్ కి కొత్త హంగులు జోడించి ప్రేక్షకులను అరేబియన్ రాజ్యం లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను మే 24న దాదాపు 350 థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అల్లాద్దీన్ ఇండియా లో భారీగా రిలీజ్ అవ్వడంతో పాటు తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో కూడా విడుదల అవుతుంది. 

సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ "ఎఫ్ 2" కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి అల్లాద్దీన్ కలిసి వర్క్ చేసారు . ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాద్దిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు.