బాల‌య్య టైటిల్‌తో సుడిగాడు

Allari Naresh locks Balakrishna's title
Saturday, December 8, 2018 - 17:00

అల్ల‌రి న‌రేష్ మ‌రోసారి హీరో పాత్ర‌ల‌కి రెడీ అవుతున్నాడు. వ‌రుస అప‌జ‌యాల‌తో హీరో వేషాల‌కి కొంత గ్యాప్ ఇచ్చి, మ‌ళ్లీ రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గా భీమ‌నేని డైర‌క్ష‌న్‌లో చేసిన సిల్లీ ఫెలోస్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ప్ర‌స్తుతం  మహర్షి సినిమాలో మహేష్ బాబుకి మిత్రుడిగా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. 

తాజాగా అనిల్ సుంక‌ర ప్రొడక్ష‌న్‌లో మ‌రో మూవీ అంగీక‌రించాడు. గిరి అనే దర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ మూవీకి బంగారు బుల్లోడు అనే టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ట‌. బాలకృష్ణ కెరియ‌ర్‌లో బంగారు బుల్లోడు సూప‌ర్‌హిట్ మూవీ. ఆ టైటిల్‌తో. గతంలో సుందరకాండ, యముడికి మొగుడు, ఆహ నా పెళ్లంట లాంటి పాత సినిమాల టైటిల్స్‌ని త‌న సినిమాల‌కి వాడాడు ఈ సుడిగాడు.