మ‌హర్షిలో గాలిశీను!

Allari Naresh reveals about his role in Mahesh Babu's Maharshi
Wednesday, September 5, 2018 - 19:45

మ‌హేష్‌బాబు 25వ చిత్రం.."మ‌హ‌ర్షి". ఇందులో మ‌హేష్‌బాబుకి ఫ్రెండ్‌గా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి చిన్న క్లూ ఇచ్చాడు అల్ల‌రి హీరో. నాది కీల‌క‌మైన పాత్ర‌. "గ‌మ్యం"లో గాలి శీను పాత్రలా ఇంటెన్స్‌గా ఈ పాత్ర ఉంటుంద‌ని చెప్పాడు అల్ల‌రి న‌రేష్‌. గాలిశీను పాత్ర త‌న‌కి ఎంత పేరు తెచ్చిందో ఇది అంత‌క‌న్నా ఎక్కువ నేమ్ తీసుకొస్తుంద‌ని ధీమాగా చెపుతున్నాడు.

సొంతంగా తాను కామెడీ హీరో అయి ఉండి మ‌హేష్‌బాబు సినిమాలో సైడ్ క్యార‌క్ట‌ర్ చేయ‌డం ఎలా అనిపిస్తోందని అడిగితే ఇది నాకు కొత్త కాదు క‌దా అని స‌మాధానం ఇచ్చాడు. గ‌తంలో "విశాఖ ఎక్స్‌ప్రెస్" సినిమాలో నెగిటివ్ రోల్ చేశా, ర‌వితేజ న‌టించిన "శంభో శివ శంభో"లోనూ న‌టించా క‌దా అని గుర్తు చేశాడు. హీరో పాత్ర‌నా, విల‌న్ పాత్ర‌నా, రెండో హీరో రోలా అన్న‌ది చూడ‌న‌ని అంటున్నాడు. పాత్ర బాగుంటే ఒప్పేసుకుంటాడ‌ట‌.

మ‌హ‌ర్షిలో ఆ పాత్రకి నేను బాగుంటాన‌ని మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి అనుకోవ‌డం వ‌ల్లే ఒప్పుకున్నాడ‌ట‌. మ‌హేష్‌బాబు సెట్‌లో ఉంటే సూప‌ర్ ఫ‌న్‌గా ఉంటుంద‌ని సూప‌ర్‌స్టార్‌ని పొగిడేశాడు.

మ‌రోవైపు, మారుతి డైర‌క్ష‌న్‌లోనూ ఓ మూవీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌.