అల్లు.... వేళ్ళు, కాళ్ళు పెడుతున్నారా?

Is Allu Aravind interfering Ala Vaikunthapuramlo making?
Thursday, December 19, 2019 - 16:30

ఆలవైకుంఠపురంలో సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ఫైనల్ కట్ (అంటే సినిమా నిడివి) ఇంకా పూర్తి కాలేదు కానీ... అప్పుడే దీని గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

అల్లు అరవింద్ ... ఈ సినిమా మేకింగ్ లో వేళ్ళు, కాళ్ళు పెడుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం లేపారు. ఇప్పుడు ఏకంగా సినిమా నిడివిని కూడా అల్లు అరవిందే డిసైడ్ చేస్తున్నారు అని రూమర్ షురూ అయింది. కానీ త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడికి అల్లు అరవింద్ చెప్తాడా? అలంటి సాహసం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ చేస్తారా?

సినిమా నిడివి ఎంత ఉండాలి అనేది పూర్తిగా త్రివిక్రమ్ నిర్ణయమే. అల్లు అరవింద్ తనఅబ్జార్వషన్ లు చెప్పొచ్చు కానీ ... త్రివిక్రమ్ తో గొడవ పెట్టుకోవడం.... సినిమాలో ఫింగరింగ్ చెయ్యడం అనేది ఉండదు అని టీం చెప్తోంది. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఫుల్లుగా ఉండనుంది. అరవింద సమేతలో అది మిస్ అయ్యారు త్రివిక్రమ్. ఈ సినిమాని ఫామిలీ ఎంటర్టైనర్ గా ప్యాక్ చేశారట.