పెళ్లి చేసుకోనంటున్న బన్నీ కూతురు

Allu Arjun and his daughter's funny video
Friday, February 8, 2019 - 13:15

అల్లు అర్జున్ కూతురు అర్హకు జస్ట్ రెండేళ్లు మాత్రమే. ఆ వయసుకే ఆ పాప పెళ్లి చేసుకోనంటోంది. అయితే ఇదంతా సరదాగానే. నేను చూసిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలంటాడు బన్నీ. నేను చేసుకోను అంటూ ముద్దుగా సమాధానం ఇస్తుంది అర్హ. ఆ రిప్లయ్ కు దొంగ ఫెలో అంటూ బన్నీ పొంగిపోతుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకప్పుడు కొడుకుతో సరదాగా ఆడుకునే వాడు బన్నీ. కానీ ఇప్పుడు పెద్దోడు స్కూల్ కు వెళ్తున్నాడు. దీంతో ఇప్పుడు బన్నీకి కూతురే లోకమైంది. పైగా ఈ హీరో ఇప్పుడు కాస్త ఖాళీగా ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. దీంతో ఈ ఫ్రీ టైమ్ లో సినిమా కోసం మేకోవర్ అవ్వడంతో పాటు ఇలా పాపతో సరదాగా ఆడుకుంటున్నాడు అల్లు అర్జున్View this post on Instagram


My Donga fellow

A post shared by Allu Arjun (@alluarjunonline) on