బావ‌కి బ‌న్(న్ని) మ‌స్కా!

Allu Arjun calls NTR Baava
Sunday, November 11, 2018 - 23:30

ఈ రిలేషన్ చెప్పుకోవడానికి కాస్త వింతగా, కొత్తగా ఉన్నప్పటికీ నిజం. ఎన్టీఆర్ ను అల్లు అర్జున్ బావ అనే పిలుస్తాడు. ఈ విషయాన్ని స్వయంగా బన్నీనే బయటపెట్టాడు. టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఇలా బయటపడ్డాడు. 

"ట్రిపుల్ ఆర్ ఫిలిం లాంఛ్ అయింది. నా ఫేవరెట్ మెగాపవర్ రామ్ చరణ్ గారికి, నా బావ తారక్ కు, రాజమౌళి గారికి ఆల్ ది బెస్ట్. నేను తారక్ ను సరదాగా బావ అని పిలుస్తుంటాను."

ఇలా తారక్, తనకు మధ్య ఉన్న అన్యోన్యాన్ని బయటపెట్టాడు బన్నీ. ఇండస్ట్రీలో ఇలా వరసలు పెట్టి పిలుచుకోవడం కొత్తేంకాదు. నాని చాలామందిని బాబాయ్ అని పిలుస్తుంటాడు. ఇక ఎన్టీఆర్-రామ్ చరణ్ కూడా చాలా క్లోజ్. రానా-నాగచైతన్య, బన్నీ-ప్రభాస్ గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. 

ఆర్-ఆర్-ఆర్ తో టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీస్టారర్ కు తెరలేచింది. ఈ సినిమా తర్వాత మరింత మంది తెలుగు బిగ్ స్టార్స్ కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశాలున్నాయి.