ఇది వ‌ర‌కు రిలీజ్‌, ఇపుడు ప్రారంభం

Allu Arjun missing April sentiment
Monday, February 11, 2019 - 13:45

ఏప్రిల్ 8..అల్లు అర్జున్ పుట్టిన రోజు. కొన్నేళ్లుగా త‌న ప్ర‌తి పుట్టిన రోజుకి లేదా బ‌ర్త్‌డేకి ఒక వారం ముందో, వెనుకో త‌న సినిమాని విడుద‌ల చేస్తూ వ‌స్తున్నాడు. ఏప్రిల్ నెల‌లోనే వ‌చ్చాయి రేసుగుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, స‌రైనోడు చిత్రాలు. నా పేరు సూర్య సినిమాని కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా.. భ‌ర‌త్ అనే నేను సినిమా కార‌ణంగా మే మొద‌టి వారానికి షిప్ట్ చేశాడు. ఐతే నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ కావ‌డంతో మ‌రో సినిమాని ప్రారంభించేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. చివ‌రికి త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో సినిమా ఓకే చేశాడు. 

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం అయ్యే ఈ సినిమా మార్చి, ఏప్రిల్‌ నుంచి షూటింగ్ జ‌రుపుకోనుంది. అంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుద‌ల ఉండ‌దు, సినిమా ప్రారంభం ఉంటుంది. అలా ఒక ఏడాది అంతా వేస్ట్ చేసుకున్నాడు బ‌న్ని. త్రివిక్ర‌మ్ సినిమా మ‌ళ్లీ వ‌చ్చే ఏప్రిల్‌కి రిలీజ్ అవుతుందనుకుంటే పొర‌పాటు. ద‌స‌రాకి కానీ, సంక్రాంతికి కానీ రిలీజ్‌డేట్‌ని సెట్ చేసుకుంటుంది.