పాజిటివ్ ప్రచారం కోసం బన్ని ప్రయత్నం

Allu Arjun trying for positive publicity
Monday, July 29, 2019 - 15:15

అల్లు అర్జున్ సినిమా గురించి ఇటీవల చాలా పుకార్లు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమా చేయడం బన్నికి అస్సలు ఇష్టం లేదనేది బాగా కలవర పెట్టిన రూమర్. ఆసక్తి లేకపోతే సినిమా ఎందుకు చేస్తాడు. ఈ విషయంలో బన్ని టీమ్ బాగా బాధపడింది. అభిమానులు కూడా తెగ వర్రీ అయ్యారు.

పుకార్లకి చెక్ పెట్టేందుకు అల్లు అర్జున్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమా గురించి పాజిటివ్ బజ్ రావాలంటే ఏమి చేయాలని ఆలోచిస్తోంది. అలా థింక్ చేస్తే వచ్చిన ఆలోచన... సినిమా టైటిల్ ప్రకటించడం అనేది.

అయితే ఈ సినిమా టైటిల్స్ ఎపుడు ప్రకటిస్తారు అనేది చూడాలి. ఆగస్ట్ లోనే  వస్తుందని సోషల్ మీడియాలో బజ్ మొదలైంది.