అమ‌లాపాల్‌..ది యాంగ్రీ విమెన్‌

Amala Paul lambasts producers
Thursday, June 27, 2019 - 14:30

త‌న‌ని ఒక సినిమా నుంచి నిర్మాత‌లు తొల‌గించ‌డంతో అమ‌లాపాల్ యాంగ్రీ విమెన్ అవ‌తారం ఎత్తింది. నిర్మాత‌లను చెడామడా తిట్టింది.

విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమాలో మొద‌ట హీరోయిన్‌గా అమ‌లాపాల్‌ని తీసుకున్నారు. కానీ స‌డెన్‌గా ఆమెని సినిమా నుంచి తీసేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. పారితోషికం విష‌యంలోనూ, వ‌స‌తుల విష‌యంలో ఆమె చాలా డిమాండ్‌లు చేసింద‌న్న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. అయితే, ఇదంతా అబ‌ద్ద‌మ‌ని అమ‌లా విరుచుకుప‌డింది.

నిర్మాత‌లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌ని తెలిసిన ప్ర‌తిసారి తాను పారితోషికాన్ని త‌గ్గించుకున్నాను అని తెలిపింది. అలాగే ప‌ల్లెటూళ్లల్ల్లో షూటింగ్‌లు చేసిన‌పుడు ఆ ఊళ్ల‌ల్లోనే ఉండేద‌ట‌. అలా నిర్మాత‌ల‌కి హోట‌ల్ బిల్లు త‌ప్పించింద‌ట‌. ఇన్ని త్యాగాలు చేసిన త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక అస‌లు రీజ‌న్ వేరు అని అంటోంది. మొన్నామ‌ధ్య విడుద‌లైన ఆమె సినిమా టీజ‌ర్‌లో అమ‌లా న‌గ్నంగా న‌టించిన‌ట్లు క‌నిపించింది. ఆ టీజర్‌ చూసి తనను విజయ్‌ సేతుపతి చిత్రం నుంచి తొలగించారంటోంది.

ఆ టీజ‌ర్ వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కి వేరే ర‌క‌మైన ఇమేజ్ వ‌చ్చింద‌ని ఈ నిర్మాత‌లు భ్ర‌మ‌ప‌డ్డార‌ట‌. త‌మ సినిమాకి ఆమె ఇమేజ్ ఇబ్బంది అవుతుంద‌ని తొల‌గించార‌ట‌.